: శ్రీవారి సేవలో కృష్ణంరాజు, పురంధేశ్వరి
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని ఈ ఉదయం బీజేపీ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు దర్శించుకున్నారు. ముందుగా స్వామివారి సుప్రభాత సేవలో శ్రీవారిని నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు దర్శించుకోగా, వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికారు. తర్వాత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ కూడా దర్శించుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.