: సికింద్రాబాదులో మహిళపై అత్యాచారయత్నం, బ్లేడుతో దాడి


సికింద్రాబాదులోని బొల్లారంలో ఇవాళ మధ్యాహ్నం ఓ మహిళపై ఆగంతుకుడు తప్పతాగి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మహిళ కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News