: ప్రశ్నించే నాయకుడు పవన్ కల్యాణ్: నటుడు శివాజీ


పవన్ రాజకీయ ప్రవేశం గురించి సినీనటుడు శివాజీ స్పందించారు. 'ప్రశ్నించడానికే వస్తున్నా' అన్న నినాదంతో వస్తున్న పవన్ కల్యాణ్ ను తాను అభినందిస్తున్నానని చెప్పారు. ప్రశ్నించే నాయకుడు ఇన్నాళ్ళూ లేకపోవడం దౌర్భాగ్యకరమైన విషయమని... ఇదే నినాదంతో వవన్ వస్తే ప్రజలు ఆదరించి, గెలిపిస్తారని అభిప్రాయపడ్డారు.

రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టిపోయాయని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు తిట్టిన వారిని ఈ రోజు పార్టీల్లో చేర్చుకుంటున్నారని... ఒక రోజులోనే ఆ నాయకుడు మంచివాడై పోతాడా? అని శివాజీ ప్రశ్నించారు. ఇది అన్ని పార్టీలకూ వర్తిస్తుందని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో... ఇప్పటికే అన్ని పార్టీల నేతలు వారివారి ప్రాంతాల్లో మద్యం, డబ్బును రెడీగా ఉంచారని విమర్శించారు. రాజకీయ పార్టీలు కుల పార్టీలైపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు కూడా వీటిని గమనించాలని... ఎంతకాలం ఇలాగే మోసపోతారని ప్రశ్నించారు. అందుకే కళాకారులు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో మంచి వ్యక్తి అయిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News