: నోకియా ఆండ్రాయిడ్ ఫోన్లు నేటి నుంచి లభ్యం


ఎంతో ఆసక్తిగా చూస్తున్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్లు భారత్ కు వచ్చేశాయి. వీటిని ఈ రోజు భారత్ లో విడుదల చేస్తున్నట్లు నోకియా ప్రకటించింది. నోకియా ఎక్స్ గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర 8,599 రూపాయలు. నోకియా ఎక్స్ ప్లస్, నోకియా ఎక్స్ ఎల్ అనే మరో రెండు మోడళ్లు వచ్చే రెండు నెలల్లో భారత్ లో విడుదల చేయనున్నట్లు నోకియా ప్రకటించింది. నోకియా ఎక్స్ మోడల్లో ఉన్న ప్రతికూలత ఏమిటంటే గూగుల్ ప్లే స్టోర్ ను యాక్సెస్ చేసుకోవడానికి వీలవదు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ల కోసం నోకియా స్టోర్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, డ్యుయల్ సిమ్ తదితర ఫీచర్లు, మరెన్నో అప్లికేషన్లు ప్రీ ఇన్ స్టాల్డ్ గా ఇందులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News