: ఎన్నికలు నిర్వహించాలని ఎన్నోసార్లు చెప్పాం: రమాకాంతరెడ్డి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి చెప్పామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయినా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు నెలకొన్న ఎన్నికల గందరగోళానికి గత ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. అప్పుడే ఎన్నికలు జరిపి ఉంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని ఎన్నికల కమిషనర్ చెప్పారు.