: లంక జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం


ఆసియా కప్ క్రికెట్ విజేత శ్రీలంక జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. ఏంజెలో మాథ్యూస్ నాయకత్వంలోని లంకేయులు ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంప్ పాకిస్తాన్ ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కప్ తో ఆదివారం నాడు కొలంబో చేరుకున్న లంక జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ బస్ లో లంక క్రికెట్ పరిపాలక భవనం వరకు ఊరేగింపు నిర్వహించారు.

  • Loading...

More Telugu News