: ఐపీఎల్ వేదికను నేడు ఖరారు చేయనున్న బీసీసీఐ


ఎన్నికల నేపథ్యంలో భారత్ లో ఐపీఎల్ తాజా సీజన్ కు భద్రత కల్పించలేమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అశక్తత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-7లో అత్యధిక మ్యాచ్ లు భారత్ లోనే నిర్వహిస్తామని బీసీసీఐ చెబుతున్నా, అది వాస్తవరూపం దాల్చేది సందేహమే. ఈ క్రమంలో నేడు బీసీసీఐ వర్కింగ్ కమిటీ కేంద్ర హోం శాఖ వర్గాలతో సమావేశం కానుంది. ఈ భేటీ అనంతరం వేదికను ఖరారు చేస్తారు. లీగ్ మ్యాచ్ లు విదేశాల్లోనూ, నాకౌట్ రౌండ్ భారత్ లోనూ జరపనున్నట్టు ఇంతకుముందు వార్తలొచ్చాయి. దక్షిణాఫ్రికా వేదికగా ఈ మ్యాచ్ లు నిర్వహించాలని భావించినా, అక్కడ కూడా ఈ వేసవిలో ఎన్నికలు ఉన్నాయి. దీంతో, యూఏఈ గానీ, బంగ్లాదేశ్ గానీ ఐపీఎల్ వేదికగా ఎంపికయ్యే చాన్సుంది.

  • Loading...

More Telugu News