: అతి వ్యాయామం... తీసింది ఆ యువకుడి ప్రాణం


'అతి సర్వత్ర వర్జయేత్' అని పెద్దలు చెప్పినా ఈతరం పెడచెవిన పెడుతోంది. వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే, కానీ అతి వ్యాయామం అనర్థమని మరోసారి రుజువైంది. హైదరాబాదు ఎల్బీనగర్ పరిధిలోని అలకాపురి కాలనీలో ఉన్న ఓజిల్ సాలిడ్ ఫిట్ నెస్ సెంటర్ (జిమ్)లో వాసు అనే యువకుడు ట్రెడ్ మిల్ మీద పరుగెత్తుతున్నాడు. ఏకబిగిన రెండు గంటల పాటు పరుగులు తీశాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అయితే ఆ విషయాన్ని అక్కడెవరూ గమనించకపోవడంతో వాసు అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తును ప్రారంభించారు. ఘటన జరిగిన వెంటనే జిమ్ యజమాని పరారయ్యాడు.

  • Loading...

More Telugu News