: కళాకారుడిని కాల్చి చంపిన మావోయిస్టులు


పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ముత్యం అలియాస్ భిక్షం కొమ్ముడోలు అనే గిరిజన కళాకారుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా పోలీసులకు ముత్యం సమాచారం చేరవేస్తున్నాడని మావోలు ఒక లేఖలో పేర్కొన్నారు. గతంలో ప్రజాకోర్టులో తీసుకున్న నిర్ణయం మేరకే ముత్యంను చంపుతున్నట్టు ప్రకటించారు. శబరి ప్రాంతానికి చెందిన మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మరో ఘోరం ఏమిటంటే... ముత్యంను అతని కొడుకు ఎదుటే కాల్చి చంపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతూరు మండలం తుమ్మల గ్రామంలో జరిగింది.

  • Loading...

More Telugu News