: కాంగ్రెస్ నేతలు డిప్రెషన్ లో ఉన్నారు, చికిత్స అవసరం: బీజేపీ
కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ నిన్న నరేంద్ర మోడీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల బీజేపీ దీటుగా బదులిచ్చింది. కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతో డిప్రెషన్ లో కూరుకుపోయారని, వారికిప్పుడు చికిత్స అవసరం అని బీజేపీ ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా కాంగ్రెస్ నేతల మానసిక స్థితి వెల్లడవుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి అనంతరం వారి పరిస్థితి ఎలా ఉండనుందో, ఇప్పుడలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని విమర్శించారు.
నక్వీ పనిలోపనిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంపైనా వ్యంగ్యోక్తులు విసిరారు. 'ఆయనో అంతర్జాతీయ నేత, అది నివాసం గానీ, చార్టర్డ్ విమానం గానీ, భద్రత గానీ... ఏదీ ఒకపట్టాన ఆయన అంగీకరించరు' అని వ్యాఖ్యానించారు.