: పవన్ కల్యాణ్ లోక కల్యాణం చేస్తామంటే ఎవరికీ ఇబ్బందిలేదు: వెంకయ్య


సినీ హీరో పవన్ కల్యాణ్ రాజకీయ రంగప్రవేశంపై బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు స్పందించారు. ఆయన పార్టీ పెట్టి లోక కల్యాణానికి పాటు పడతానంటే ఎవరికీ ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. నెల్లూరులో నేడు జరిగిన 'మోడీ ఫర్ పీఎం' సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఎందుకు పెడుతున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ అధికారంలోకి వస్తే సీమాంధ్రకు పదేళ్ళ పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఐదేళ్ళ ప్రతిపత్తిని తాము పొడిగిస్తామని హామీ ఇచ్చారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీమాంధ్రకు ప్యాకేజీ కింద రూ.50 వేల కోట్లు ఇస్తామని జైరాం రమేశ్ చెప్పడం బూటకమని వెంకయ్య కొట్టిపారేశారు. ఆ నిధులు ఎక్కడి నుండి తెచ్చిస్తారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News