: మూడేళ్ల పాటు పస్తులుంచి ఉసురు తీసిన దంపతులకు ఉరిశిక్ష!
ఇంట్లో పనిమనిషికి తిండి పెట్టకుండా వేధించి, ప్రాణం పోవడానికి కారణమైన మలేసియా దంపతులకు అక్కడి హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఫాంగ్ కాంగ్ మెంగ్ (58), అతని భార్య చింగ్ యెన్(56) తమ ఇంట్లో ఇండోనేసియాకు చెందిన 26 ఏళ్ల ఇస్తి కొమర్యా అనే యువతిని పనికి కుదుర్చుకున్నారు. మూడేళ్లు పనిచేశాక ఆమె 2011 జూన్ లో మరణించింది. తమ దగ్గర పనిచేసే మహిళకు వీరు మూడేళ్ల పాటు సరిగ్గా తిండి పెట్టకుండా పస్తులుంచడం వల్లే ఆమె మరణించినట్లు జడ్జి నూర్ అజియాన్ షారీ తెలిపారు. వారికి ఉరిశిక్ష ఖరారు చేశారు. వారింట్లో చేరినప్పుడు ఇస్తి 46 కేజీల బరువు ఉంటే చనిపోయే నాటికి 26కేజీలకు క్షీణించడమే ఆమెను ఎలా చూసుకున్నారో తెలియజేస్తోంది.