: తెప్పోత్సవాల దృష్ట్యా శ్రీవారి ఆర్జిత సేవల రద్దు
ప్రముఖ హైందవ పుణ్యక్షేత్రం తిరుమలలో ఐదురోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. తెప్పోత్సవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వెంకన్న సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 28 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.