: నిలకడగా లంక బ్యాటింగ్
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. పాకిస్తాన్ విసిరిన 261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంకేయులు 27 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 149 పరుగులు చేశారు. ఓపెనర్ కుశాల్ పెరీరా 42 పరుగులు చేసి అజ్మల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ వెంటనే వచ్చిన సంగక్కరను అజ్మల్ డకౌట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ తిరిమన్నే (65 బ్యాటింగ్), జయవర్థనే (41 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. లంక జట్టు గెలవాలంటే 23 ఓవర్లలో 111 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లున్నాయి.