: లంబూకి జరిమానా
టీమిండియా పొడగరి పేస్ బౌలర్ ఇషాంత్ శర్మకు జరిమానా విధించారు. ఢిల్లీ టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ టెయిలెండర్ జేమ్స్ ప్యాటిన్సన్ అవుటై పెవిలియన్ కు మరలుతున్న సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు లంబూ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.
తన బౌలింగ్ లో బౌల్డ్ అయిన ప్యాటిన్సన్ ను, ఇక పెవిలియన్ కు నడవమంటూ ఇషాంత్ సంజ్ఞలు చేశాడు. ఈ నేపథ్యంలో, ఐసీసీ నియమావళిని అనుసరించి మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళే.. ఇషాంత్ పై చర్య తీసుకున్నారు. ఇషాంత్ ప్రవర్తనను 2.1 ఆర్టికల్ ప్రకారం లెవల్ వన్ తప్పిదంగా పరిగణించారు.