: పవన్ కల్యాణ్ కు సాదరంగా స్వాగతం పలుకుతాం: జేపీ
తెలుగు సినీ హీరో పవన్ కల్యాణ్ లోక్ సత్తా పార్టీలోకి వస్తే సాదరంగా స్వాగతం పలుకుతామని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) అన్నారు. ఖమ్మంలో ఆయన ఈరోజు (శనివారం) మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు వ్యాపార ధోరణిని విడనాడాలని, అన్ని రాజకీయ పక్షాలు కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ ఆంధ్రా, తెలంగాణ ఇరు ప్రాంతాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జేపీ వెల్లడించారు.