: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అంశంలో మన ర్యాంకు 111
మహిళలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించే విషయంలో భారత్ 111వ స్థానంలో ఉంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) అనే సంస్థ నిర్వహించిన ఈ అంశంలో ఓ జాబితా రూపొందించింది. మన పార్లమెంటు విషయానికొస్తే లోక్ సభలో 545 సీట్లకు గాను 62 మంది, రాజ్యసభలో 245 సీట్లకు గాను 28 మంది మాత్రమే మహిళా ప్రతినిధులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొత్తం 189 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో ఓ ఆఫ్రికా దేశం అగ్రస్థానంలో నిలిచింది. దిగువ సభలో 60 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రువాండా నెంబర్ వన్ గా నిలిచింది. ఇక అగ్రరాజ్యం అమెరికా 83, కెనడా 54వ ర్యాంకు దక్కించుకున్నాయి.