: నిరుద్యోగులను మోసగిస్తున్న 'విప్రో' ఉద్యోగి అరెస్ట్


నిరుద్యోగ యువతను మోసగిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో సందీప్ కుమార్ దాస్ అనే విప్రో ఉద్యోగి కూడా ఉన్నాడు. ఐటీ ఉద్యోగాలు ఆశిస్తున్న యువతకు గాలం వేసి వారి నుంచి రూ.15 లక్షల వరకు దండుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో షేక్ బీబీ హజ్రా, భాష్యం అనిల్ కుమార్, కాకర్లమూడి ప్రమోద్ కుమార్ లను ఇంతకుముందే అరెస్టు చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో నోయిడా వెళ్ళి సందీప్ దాస్, విపిన్ కుమార్, సనూ సింగ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బీబీ హజ్రా ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు.

హజ్రా జాబ్ పోర్టళ్ళ నుండి నిరుద్యోగుల వివరాలు సేకరించి వారికి నకిలీ ఇంటర్వ్యూ లెటర్స్ పంపేదని వెల్లడించారు. అనంతరం వారి నుంచి డబ్బులు వసూలు చేసి నోయిడాలోని విప్రో క్యాంపస్ లో ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహించేవారని, విప్రో ఉద్యోగి సందీప్ దాస్ ఈ పని చేసేవాడని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో, సందీప్ కు సగం వాటా దక్కేదని వివరించారు.

  • Loading...

More Telugu News