: నిప్పులు చెరిగాడు
పాకిస్తాన్ జట్టుతో ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ నిప్పులు చెరిగాడు. మిర్పూర్ లో జరుగుతున్న ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ ను మలింగ ఆరంభంలోనే దెబ్బతీశాడు. మలింగ ధాటికి పాక్ 18 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ మూడు వికెట్లు మలింగ ఖాతాలోకే చేరాయి. ప్రస్తుతం పాక్ స్కోరు 8 ఓవర్లలో 3 వికెట్లకు 20 పరుగులు కాగా, కెప్టెన్ మిస్బావుల్ హక్ (3 బ్యాటింగ్), ఫవాద్ ఆలం (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.