: సహాయక చర్యలకు నౌకలను పంపిన చైనా


వియత్నాంకు 153 కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోయిందన్న వార్తల నేపథ్యంలో సహాయక చర్యల కోసం రెండు నౌకలను చైనా పంపింది. మరోవైపు వియత్నాం అధికారులు విమానం కూలిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. మలేసియన్ సాగర జలాల్లో వియత్నాంకు చెందిన తోచు దీవికి 153 కిలోమీటర్ల దూరంలో కూలిపోయి ఉండవచ్చని వియత్నాం నేవీ అధికారి అడ్మిరల్ వాన్ ఫట్ చెప్పారు. అవసరమైతే తాము సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, కూలిపోయిందన్న వార్తలను మలేసియా ప్రభుత్వం, మలేసియన్ ఎయిర్ లైన్స్ ఇంకా ధ్రువీకరించడం లేదు.

  • Loading...

More Telugu News