: టీఆర్ఎస్ తో పొత్తు వద్దంటూ సోనియాకు టీకాంగ్ నేతల లేఖ


మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో టీకాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణను ఏర్పాటు చేసిన ఘనత సోనియాదేనని... రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేకుండా... ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు వద్దని సోనియాకు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News