: టీడీపీ తీర్థం పుచ్చుకున్న గల్లా అరుణ, జయదేవ్
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గల్లా అరుణ, ఆమె కుమారుడు జయదేవ్ ఈ ఉదయం టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధ్యక్షుడు చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ తమను నట్టేట్లో ముంచిందని ఈ సందర్భంగా అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి పూర్తి సహకారం అందించేందుకు పార్టీలో చేరుతున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు. సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.