: నరేంద్ర మోడీ నాయకత్వం అద్భుతం: మెట్రో శ్రీధరన్
దేశంలోనే అత్యుత్తమ సేవలందిస్తున్న మెట్రో రైల్వే అహ్మదాబాదులో ఉంది. ఢిల్లీ మెట్రో రైలును శ్రీధరన్ రూపొందించారు. ఆయన ఇప్పుడు యూపీ ప్రభుత్వంలోని లక్నో మెట్రోకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆసియాలోనే అత్యుత్తమ మెట్రోగా పేరొందిన అహ్మదాబాదు మెట్రోను మాత్రమే కాదు, నరేంద్ర మోడీపై శ్రీధరన్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గుజరాత్ సీఎం మోడీ నాయకత్వం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తదితర అంశాలపై ఆయన ట్వీట్ చేశారు. నరేంద్ర మోడీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారని ట్విట్టర్ లో శ్రీధరన్ పొగడ్తలతో ముంచెత్తారు.