: వారణాసి బరిలో మోడీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి నుంచి కూడా పోటీ చేస్తారు. ఆయన బరిలో దిగే రెండో నియోజకవర్గంగా బీజేపీ అధినాయకత్వం వారణాసిని ఎంపిక చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ వెలుపల మోడీ ఎక్కడ బరిలో దిగినా తాను పోటీకి సిద్ధమేనని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నేతలు వారణాసి వైపు మొగ్గుచూపారు. కాగా, ఈ పుణ్యక్షేత్రం నుంచి బరిలో దిగాలని ఆశిస్తున్న మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కాన్పూర్ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో సోమ్ నాథ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు.