: జీతం రూ.22వేలు... ఆస్తులు రూ.22కోట్లు
ఒక గార్డు జీవితమంతా కష్టపడితే ఎంత సంపాదించగలడు... మహా అయితే కొన్ని లక్షల రూపాయలు. కానీ, మధ్యప్రదేశ్ లోని ప్రజాపనుల శాఖలో గార్డుగా చేస్తున్న గురుకృపాల్ సింగ్ ఎంత సంపాదించాడో తెలుసా? రూ. 22కోట్ల రూపాయలు! మరి ఆయన నెల జీతం రూ.22వేలే. ఇతని అవినీతిపై, ఆదాయానికి మించిన ఆస్తులపై సమాచారం అందుకున్న మధ్యప్రదేశ్ లోకాయుక్త అధికారులు ఇండోర్ లోని తిలక్ నగర్ లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. నగదు కట్టలు, ఆభరణాల గుట్టలు, కార్లు, ద్విచక్రవాహనాలు, భూములు, భవనాల పత్రాలు... అబ్బో... లెక్కపెట్టడానికే అధికారులకు తల ప్రాణం తోకకొచ్చింది. మొత్తం మీద ఆ గార్డు ఆస్తులను రూ.22కోట్లుగా అంచనా వేశారు.