: నేడు టీడీపీలో చేరనున్న గల్లా అరుణ, జయదేవ్


రాష్ట్ర మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడు గల్లా జయదేవ్ లు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి జయదేవ్ పోటీచేయనున్నారు. ఇక చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజక వర్గం నుంచి అరుణకుమారి పోటీచేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News