: ‘ఎర్త్ అవర్’లో ప్రజలందరూ పాల్గొనాలి: రాంచరణ్
పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సినీ నటుడు రాంచరణ్ అన్నారు. హైదరాబాదులో జరిగిన '60 ప్లస్ ఎర్త్ అవర్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర పౌరులందరూ ఇంధనాన్ని పొదుపు చేయాలని ఆయన చెప్పారు. మార్చి 29వ తేదీన జరిగే ‘ఎర్త్ అవర్’లో రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రజలందరూ కరెంటు బల్బులను ఆర్పివేయాలని రాంచరణ్ సూచించారు.