: రేపటి ఫైనల్ కు అఫ్రిది డౌటే!
ఆసియా కప్ ఫైనల్ కు సిద్ధమవుతున్న పాకిస్తాన్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ముఖ్యంగా, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కండరాల గాయంతో బాధపడుతుండడం ఆ జట్టును కలవరపరుస్తోంది. అయితే, అఫ్రిది ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని పాక్ మేనేజ్ మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నేటి ప్రాక్టీసు సెషన్ కు ఈ విధ్వంసక క్రికెటర్ దూరంగా ఉన్నాడు. ఈ విషయమై జట్టు మేనేజర్ జకీర్ ఖాన్ మాట్లాడుతూ, అఫ్రిది చికిత్సకు స్పందిస్తున్నాడని తెలిపారు. ఈ టోర్నీలో అఫ్రిది భారత్ తో మ్యాచ్ లో కేవలం 18 బంతుల్లో 34 పరుగులు చేసి పాక్ కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. అంతేగాకుండా బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్ లోనూ విశ్వరూపం ప్రదర్శించిన ఈ పఠాన్ 25 బంతుల్లో 59 పరుగులు చేసి ఆతిథ్య జట్టుకు కడగండ్లు మిగిల్చాడు.