: టీడీపీకి తిలోదకాలిచ్చిన రజనీకుమారి
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం టీడీపీలో ముసలం పుట్టింది. ఫలితంగా నకిరేకల్ నియోజకవర్గం ఇన్ చార్జ్ గా ఉన్న రజనీకుమారి పార్టీకి రాజీనామా చేశారు. సొంత పార్టీ నేతలే తమపై దాడులకు దిగుతుంటే, పార్టీ అధిష్ఠానం పట్టించుకోవటం లేదని, అందుకు నిరసనగానే తాను, తన అనుచరులు పార్టీ వీడుతున్నామని రజనీ తెలిపారు.