: బీజేపీ వస్తుంది.. తెలంగాణ ఇస్తుంది: కిషన్ రెడ్డి
2014 ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ కొలువైన వెంటనే తెలంగాణ ఇస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు దేశంలోని అన్ని పార్టీలూ వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకోసం పనిచేస్తున్నాయని, బీజేపీ ఒక్కటే సిద్దాంతాలకోసం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.
ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు బీజేపీలో చేరిన సందర్భంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.