: మోడీకి మద్దతివ్వను, ఆ ఇద్దరూ అయితే ఓకే: మమత
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పక్కా మతతత్వ వాది అని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తే లేదంటోంది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మతతత్వ శక్తులతో కలిసే ఆలోచనే లేదని పేర్కొంటూ, గుజరాత్ లో ఏం జరిగిందో తెలీదా? అని ప్రశ్నించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏఐఏడీఎంకే చీఫ్ జయలలితతోగానీ, బీఎస్పీ చీఫ్ మాయావతితోగానీ జతకలిసేందుకు సిద్ధమని మమత స్పష్టం చేసింది. జయ, మాయ ఇద్దరూ దృఢ వైఖరి ఉన్న నేతలని, తాము ఇంతకుముందు వాజ్ పేయి హయాంలో కలిసి పనిచేశామని తెలిపింది.