: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయండి: సుప్రీం


మన రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండ్రోజుల్లో (సోమవారం లోగా) నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఎన్నికలను నిర్వహించాలని 2013 ఫిబ్రవరి 13న చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణ ఎందుకు ఆలస్యమవుతోందని నిలదీసింది. ఈ సారి తమ మాట వినకుంటే కోర్టు ధిక్కారణగా భావిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎన్నికల నిర్వహణలో జాప్యానికి సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News