: మార్చి 14న హైదరాబాదులో పవన్ కల్యాణ్ పుస్తకావిష్కరణ సభ
సినీ నటుడు పవన్ కల్యాణ్ రాసిన పుస్తకావిష్కరణ సభ ఈ నెల 14వ తేదీన జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకున్న అవగాహన, అభిప్రాయాలను పవన్ పుస్తక రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో 14వ తేదీ సాయంత్రం పవన్ కల్యాణ్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి 7.15 గంటల వరకు పవన్ ప్రసంగిస్తారు. ఈ ఆవిష్కరణ వేదికపై పవన్ కల్యాణ్ ఒక్కరే ఉంటారు. ఈ సభకు సంబంధించి పవన్ అభిమానులకు ఆహ్వానాలను పంపుతున్నారు.