: రాష్ట్ర విభజనపై స్టే ఇచ్చేందుకు ‘సుప్రీం’ నిరాకరణ!
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా? వద్దా? అనే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయిస్తామని ప్రకటించింది. అయితే, రాష్ట్ర విభజనపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు సుమారు 15 పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి.