: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న దగ్గుబాటి


సీనియర్ రాజకీయ నేత, కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలనుంచి వైదొలగనున్నారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా చానల్ తో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే, తొలుత తాను, పురంధేశ్వరి ఇద్దరం కూడా రాజకీయాలనుంచి విరమించుకోవాలని అనుకున్నామని... అయితే ఎవరో ఒకరం రాజకీయాల్లో ఉంటూ సీమాంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములం కావాలని అనుకున్నామని చెప్పారు. దీంతో పురంధేశ్వరి రాజకీయాల్లో కొనసాగేలా, తాను వైదొలగేలా నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.

తన కుటుంబానికి కూడా తాను సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా దగ్గుబాటి వెల్లడించారు. రాజకీయాల నుంచి వైదొలగాలనే అభిప్రాయాన్ని తాను 2009 నుంచి అప్పుడప్పుడు వెల్లడిస్తూనే ఉన్నానన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఆయన కారంచేడులోని తన అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులతో ఈ విషయమై చర్చించారు.

  • Loading...

More Telugu News