: వైద్యుని కొడుకు నిర్వాకం.. మహిళ మృతి
ఆర్ఎంపీ కొడుకు చేసిన వైద్యంతో తమ బిడ్డ చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా వర్థన్న పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యుని కొడుకు చేతకాని చికిత్సే మరణానికి కారణమని ఆరోపిస్తూ వారు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.