: పవన్ కల్యాణ్ రాసిన పుస్తకంలో ఏముంది?


ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్ పై చర్చ అంతా సినీ నటుడు పవన్ కల్యాణ్ చూట్టూ తిరుగుతోంది. పవన్ పార్టీ పెడతారని... లేదా ఏదో ఒక పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై ఆదివారం పవన్ వ్యక్తిగతంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో తాను రచించిన ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేస్తారని సమాచారం. దీంతో, పవన్ రాసిన పుస్తకంలో ఏముంది? అనే విషయం అందరి మదినీ తొలుస్తోంది. సామాన్యుడి ఆకలి బాధ ఎలా తీర్చాలి? వాళ్ల జీవితాల్లో వెలుగులు ఎలా నింపాలి? ఏం చేస్తే సమాజం మారుతుంది? వీటిన్నింటి కోసం రాజకీయ పార్టీలు ఎలా పనిచేయాలి? తదితర అంశాలపై తన అభిప్రాయాలకు ఈ పుస్తకంలో పవన్ అక్షర రూపం ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News