: కిరణ్ కుమార్ రెడ్డి నెలకొల్పబోయే పార్టీని పట్టించుకోం: బొత్స
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెలకొల్పబోయే పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కంపెనీలను టేకోవర్ చేసినట్టుగా పార్టీలను పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు.