: నా జీవితం, ముఖ్యమంత్రి పదవీకాలం తెరిచిన పుస్తకం: కిరణ్ కుమార్ రెడ్డి
తన జీవితం, తాను అనుభవించిన ముఖ్యమంత్రి పదవీకాలం అంతా తెరచిన పుస్తకమని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలనలో పారదర్శకత తెచ్చేందుకే కృషి చేశానని ఆయన అన్నారు. తాను చేసిన తప్పుల్ని నిరూపించాలని ప్రత్యర్థులకు ఆయన సవాలు విసిరారు. మూడేళ్ల పాలనను తిరగదోడతామంటే భయపడేది లేదని అన్నారు. తాను అన్నింటికీ సిద్ధమయ్యానని ఆయన చెప్పారు.