: విద్యుత్ చార్జీలపై పోరాడదాం రండి : వామపక్షాలు
విద్యుత్ చార్జీల పెంపుపై పోరాటానికి కలిసి రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మిగతా పార్టీలకు పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీల పేరిట ప్రభుత్వం అమాయక ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. విద్యుత్ చార్జీలకు నిరసనగా వామపక్ష పార్టీలు ఇందిరాపార్క్ వద్ద గత రెండు రోజులుగా నిరసన దీక్షలు చేస్తోన్న సంగతి విదితమే. దీక్షా శిబిరంలో ఇరువురు వామపక్షనేతలూ సర్కారుపై మండిపడ్డారు.