: మసాచుసెట్స్ వెళుతున్నారా... అమ్మాయిలూ స్కర్ట్ లు వేసుకోవద్దు!
పాశ్చాత్య దేశాల్లో స్కర్టుల వాడకం ఎప్పటి నుంచో ఉంది. లాంగ్ స్కర్టులు, మిడ్డీలు, మినీ స్కర్టులు ఇలా పలు విధాలా అతివల అందాలను వెల్లడి చేసే ఈ దుస్తులు అమెరికాలోని మసాచుసెట్స్ లో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఓ అమ్మాయి వేసుకున్న స్కర్టు లోపలి అందాలను కెమెరాతో చిత్రీకరించడం అక్కడ నేరం కాదట. ఈ విషయం సాక్షాత్తూ మసాచుసెట్స్ హైకోర్టే స్పష్టీకరించింది. ఆ రాష్ట్ర చట్టాల ప్రకారం స్కర్టు లోపలి భాగాలను చిత్రీకరించడాన్ని నిషేధించలేమని కోర్టు తెలిపింది. పూర్తి, పాక్షిక నగ్నంగా ఉన్నవారిని చిత్రీకరించడం అక్కడ నిషిద్ధం కాగా, స్కర్టు వేసుకుంటే నగ్నంగా ఉన్నట్టు కాదని వివరించింది. గతంలో మసాచుసెట్స్ ప్రజా రవాణా బస్సులో ఓ వ్యక్తి అమ్మాయి స్కర్టు కింద కెమెరా పెట్టి చిత్రీకరించిన ఘటనపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.