: ఆ ఇద్దరినీ ఎందుకు ఎంపిక చేయలేదు... గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు
ఆసియా కప్ లో టీమిండియా తన చివరి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ తో ఆడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ కు గాను టీమిండియా తుది 11 మంది ఎంపికపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ ప్లేయర్లు ఛటేశ్వర్ పుజారా, ఈశ్వర్ పాండేలను ఆఫ్ఘన్ పై బరిలోకి ఎందుకు దింపలేదని ప్రశ్నించారు. ఒకవేళ వారిద్దరూ ఆ మ్యాచ్ లో రాణిస్తే తమకిష్టులైన ఆటగాళ్ళు జట్టులో స్థానం కోల్పోతారని టీమ్ మేనేజ్ మెంట్ మధనపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏమైనా ఇది విచిత్రమైన నిర్ణయమని పేర్కొన్నారు. భారత్-ఆఫ్ఘన్ మ్యాచ్ కు కామెంటరీ చెబుతున్న సందర్భంగా సన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు కూడా సన్నీ బీసీసీఐ సెలక్షన్ ప్రక్రియను తూర్పారబట్టారు. అంతేగాకుండా జట్టు ప్రాక్టీసు విధానాన్ని కూడా తప్పుబట్టారు.