: ఢిల్లీ టెస్ట్ లోనూ భారత్ జయభేరి.. 4-0 తేడాతో బోర్డర్-గవస్కర్ ట్రోఫీ కైవసం


ఆస్ట్రేలియాపై భారతజట్టు ఢిల్లీ టెస్ట్ లోనూ గెలిచి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో నాలుగు టెస్ట్ల్ ల సిరీస్ ను 4-0 తేడాతో కైవశం చేసుకుంది.  155 పరుగులు విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మెన్ ఆరువికెట్ల తేడాతో అలవోకగా విజయాన్ని చేరుకున్నారు.

కేవలం 31.2 ఓవర్లలో భారత ఆటగాళ్లు లక్ష్యాన్ని చేరుకున్నారు. పుజారా వీరోచిత బ్యాటింగ్ చేసి 82 పరుగులతో నాటౌట్ గా నిలవడం విశేషం. కెప్టెన్ ధోనీ 12 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.  దీంతో 80 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ధోనీ సేన ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసినట్లైంది.

  • Loading...

More Telugu News