: సవతి తల్లిని హత్య చేసిన ఎమ్మెల్యే పుత్రుల అరెస్ట్
సవతి తల్లిని హత్య చేసిన బీఎస్పీ ఎమ్మెల్యే హాజి అలీమ్ చౌదరి కుమారులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలీమ్ రెండో భార్య అయిన రెహానా గతేడాది అక్టోబర్ 9న వాయువ్య ఢిల్లీలోని తన నివాసంలో శవమై తేలారు. ఆ సమయంలో అలీమ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆమెను అలీమ్ మొదటి భార్య కేకక్ష కుమారులు దానిష్(24), అనాస్(23) హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అప్పటి నుంచి వీరు పరారీలో ఉన్నారు. బుధవారం హజరత్ నిజాముద్దీన్ వద్ద మదర్సాకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో రెహానా పేరిట ఉన్న కోటి రూపాయల ఆస్తి వివాదమే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు.