: మోడీని ఎట్టి పరిస్థితులలో ప్రధానమంత్రి కానివ్వం: అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. నిజామాబాద్ లో ఆయన ప్రసంగిస్తూ, నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కానివ్వమని తెలిపారు. గుజరాత్ లో అభివృద్ధి జరిగిందని మోడీ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని... ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇప్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ లు విఫలమయ్యాయని విమర్శించారు. సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా ఎంఐఎం పోరాడుతుందని అసదుద్దీన్ చెప్పారు.