: తనది ఉడుంపట్టు అంటున్న చంద్రబాబు
నెల్లూరు ప్రజాగర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. తనది ఉడుంపట్టు అని, ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించబోనని స్పష్టం చేశారు. మనకు విరోధులు ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ నాయకులే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. దుర్మార్గులు తెలుగుజాతిని విడదీశారని ఆరోపించారు.