: సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై నియంత్రణ: విదేశాంగ మంత్రి
మారుతోన్న సమాజంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పాత్ర ఏపాటిదో అందరికీ ఎరుకే. ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, ఆర్కూట్ వంటి సోషల్ మీడియా సైట్లలో గడపని నెటిజన్లు ఉండరంటే అతిశయోక్తి లేదు . ఈ తరుణంలో దీన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందంటున్నారు విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా బలపడటమేకాదు, ప్రభావాత్మకంగా కూడా ఎదుగుతోందని ఈ నేపథ్యంలో టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరముందని ఖుర్షీద్ కోల్ కతాలో అభిప్రాయపడ్డారు.