: మరో 24 గంటలపాటు వర్షాలు
రాష్ట్రంలో మరో 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని, తద్వారా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. వడగళ్ళు, పిడుగులు కూడా పడే అవకాశముందని హెచ్చరించారు.