: తానింకా స్టార్‌నే అంటున్న షారుక్
తాను నటించిన సగం చిత్రాలు ఫ్లాపులే అయినా తానింకా స్టార్ గానే వెలుగొందుతున్నానని నటుడు షారుక్ ఖాన్ అంటున్నాడు. అయినా, ఇప్పటివరకు సినీ పరిశ్రమలో మనగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెబుతున్నాడు. 'పరిశ్రమలో ఇప్పటివరకు నా ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. ఇక్కడ ఉండటం ఒక మధురానుభూతి. ఇంతవరకు నేను 70 నుంచి 80 వరకు సినిమాలు చేశాను. అందులో యాభై శాతం వైఫల్యాలే. అయినా ఇప్పటికీ విజయవంతంగా స్టార్ గానే ప్రయాణిస్తున్నాను. ఆ సినిమాలు నాకు చాలా దగ్గరైనవి' అని ఖాన్ పేర్కొన్నాడు. ఎంతోమంది దర్శకులు, నటులు పరిశ్రమలో ఉన్నారని, ఎంతో రిస్క్ తీసుకుని సినిమాలు రూపొందిస్తారని షారుక్ తెలిపాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖాన్ ఈ విధంగా తన సినీ ప్రయాణంపై మాట్లాడాడు.