: పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ మార్చి 9 లేదా 11?
ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది. మార్చి 5న పవన్ రాజకీయ ప్రకటనపై స్పష్టతనిస్తారని పుకార్లు షికారు చేశాయి. దీనిపై పంజా సినిమా నిర్మాత నీలిమ తిరుమలశెట్టి సోషల్ మీడియాలో ఇంకాస్త వేచి చూడాలని సూచించారు. ఊహాగానాలకు, గందరగోళానికి ఆయనే తెరదించుతారని అన్నారు. కాగా మార్చి 9, లేక 11న మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉందని సమాచారం.